Praggnanandhaa Chess FIDE World Cup 2023 Final :ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ మాస్టర్, భారత యువ సంచలనం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్‌లో ప్రపంచ నెం 1 మాగ్నస్ కార్ల్సన్ ఫిడే చెస్ విజేతగా నిలిచాడు. ర్యాపిండ్ రౌండ్ మొదటి గేమ్‌లో కార్ల్సన్ గెలిచాడు. ఇక రెండో గేమ్ డ్రా అవ్వడం వల్ల ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో విజేత కార్ల్సన్ లక్షా 10 వేల డాలర్లు ( రూ. సుమారు 91 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద 80వేల డాలర్లు (రూ. సుమారు 66 లక్షలు) ప్రైజ్‌మనీ పొందనున్నారు.
Praggnanandhaa Chess FIDE World Cup 2023 Final : ప్రజ్ఞానందకు నిరాశ.. ఫిడే చెస్ విజేతగా మాగ్నస్ కార్ల్సన్ - ప్రజ్ఞానంద వర్సెస్ మాగ్నస్ కార్ల్సన్
Praggnanandhaa Chess FIDE World Cup 2023 Final : ఫిడే చెస్ ప్రపంచ ఛాంఫియన్షిప్లో గ్రాండ్ మాస్టర్, భారత యువ సంచలనం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్‌లో ప్రపంచ నెం 1 మాగ్నస్ కార్ల్సన్ ఫిడే చెస్ విజేతగా నిలిచాడు.
Published : Aug 24, 2023, 5:18 PM IST
|Updated : Aug 24, 2023, 7:13 PM IST
గురువారం జరిగిన టై బ్రేక్ రౌండ్ తొలి గేమ్‌లో నలుపు పావులతో ఆడిన కార్ల్సన్.. ప్రజ్ఞానందపై 45 ఎత్తుల తర్వాత విజయం సాధించాడు. దీంతో ప్రజ్ఞానందకు రెండో గేమ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెండో గేమ్‌లో నలుపు పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద.. మొదటి నుంచి ప్రత్యర్థి కార్ల్‌సన్‌కు గట్టిపోటీనిచ్చాడు. కానీ రెండో గేమ్ గెలవలేక.. డ్రా గా ముగించాడు. దీంతో తొలి ర్యాపిడ్ రౌండ్లోనే ఫలితం తేలిపోయింది. మొదటిసారిగా కార్ల్సన్ ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచాడు.
Praggnanandhaa FIDE World Cup 2023:అంతకుముందు మంగళవారం.. ప్రజ్ఞానంద - కార్ల్సన్ మధ్య జరిగిన ఫైనల్ పోరు డ్రాగా ముగిసింది. దీంతో బుధవారం మరోసారి వీరిద్దరూ తలపడ్డారు. రెండోసారి కూడా ఆట డ్రా అయ్యింది. ఇక గురువారం టై బ్రేక్ రౌండ్ ఫార్మాట్లో గేమ్ నిర్వహించి విజేతను డిక్లేర్ చేశారు. ఈ టోర్నమెంట్లో సాధించిన ఫలితాల వల్ల ప్రజ్ఞానంద.. కెనడాలో జరిదే 2024 క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించాడు. ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు ప్రజ్ఞానంద. అతడి కంటే ముందు బాబి ఫిషర్, కార్ల్‌సన్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడు అతనే. అంతకుముందు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆనంద్ 2000, 2002లో టైటిల్ నెగ్గాడు.