తెలంగాణ

telangana

ETV Bharat / sports

పవర్‌ లిఫ్టింగ్ చేయబోతే ప్రాణం రిస్క్​లో పడింది..! - powerlifter Alexander Sedykh Fail Lift news

'వరల్డ్​ రా పవర్​ లిఫ్టింగ్​ యూరోపియన్'​ ఛాంపియన్​షిప్​లో రష్యన్​ క్రీడాకారుడు అలెగ్జాంటర్​ తీవ్రంగా గాయపడ్డాడు. 400 కిలోల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఘటనలో అతడి కాళ్ల ఎముకలు విరిగిపోగా.. వైద్యులు చికిత్స చేసి కాపాడారు.

powerlifter Alexander Sedykh Fail Lift a Weight Of 400 Kg, video here
పవర్‌ లిఫ్టింగ్ చేయబోయి ప్రాణాల మీదికి..!

By

Published : Aug 19, 2020, 11:38 AM IST

చాలా మంది శరీరాన్ని ధృడంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల వ్యాయమాలు చేస్తుంటారు. వాటిలో బరువులెత్తడం కూడా ఒక విధమైన వ్యాయామం. ఇందులో పవర్‌ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అని రెండు రకాలున్నాయి. వీటికి అంతర్జాతీయంగా ఒలింపిక్స్‌ స్థాయిలో కూడా పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లలో కొందరు బరువులు ఎత్తలేక ప్రాణాల మీదకి తెచ్చుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ సెడిఖ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

400 కిలోల బరువు ఎత్తబోయి...

మాస్కోలో జరుగుతున్న ‘వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌’ పోటీల్లో.. 400కిలోల బరువు ఎత్తబోయి అదుపు తప్పడం వల్ల అలెగ్జాండర్ రెండు కాళ్లు విరిగాయి. స్క్వాట్‌లో భాగంగా అలెగ్జాండర్ భారీ బరువును భుజాలపై ఉంచుకుని కింద నుంచి పైకి లేవాల్సి ఉంది. అయితే బరువును భుజాలపై ఎత్తుకున్న అలెగ్జాండర్ కింద నుంచి పైకి లేచే క్రమంలో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో అతడి తొండ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడున్న వారు వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు.

శస్త్రచికిత్స అనంతరం అలెగ్జాండర్‌ తన ఇన్​స్టా ఖాతాలో ఫొటోలను షేర్ చేశారు.

"తిరిగి కోలుకునేందుకు ఇదే మొదటి అడుగు. పది రోజుల తర్వాత కుట్లు తొలగిస్తారు. అప్పుడు కొంచెం తేలికగా ఉంటుంది"అని రాసుకొచ్చారు. అయితే అలెగ్జాండర్ కోలుకోవడానికి సుమారు నెలరోజులపైనే పడుతుందని డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా ఇదే పోటీల్లో 250 కిలోల బరువు ఎత్తబోయి ఓ అథ్లెట్ రెండు కాళ్లు విరగ్గొట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details