తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన బాక్సర్​ పూజ- మరోసారి స్వర్ణం - లాల్బుయట్​సైహి

ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లోని 75 కిలోల విభాగంలో భారత బాక్సర్​ పూజా రాణి విజేతగా నిలిచింది. ఆదివారం టోర్నీలో జరిగిన ఫైనల్లో మోవ్లోనోవా(ఉజ్బెకిస్థాన్​)పై విజయం సాధించి మరోసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

Asian Boxing Championships
ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్

By

Published : May 30, 2021, 11:02 PM IST

Updated : May 30, 2021, 11:20 PM IST

దుబాయ్​ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో డిఫెండింగ్​ ఛాంపియన్ పూజా రాణి(75 కిలోలు) వరుసగా విజేతగా నిలిచింది. ఆదివారం టోర్నీలో జరిగిన తుదిపోరులో మావ్లుడా మోవ్లోనోవా(ఉజ్బెకిస్థాన్​)పై గెలుపొంది స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పతకంతో పాటు ఆమెకు రూ.7.23 లక్షల(10వేల డాలర్లు)ను బహుమానంగా ఇవ్వనున్నారు.
అయితే టోర్నీలో తొలిసారి పాల్గొన్న భారత బాక్సర్​ లాల్బుయట్​సైహి 64 కేజీల విభాగంలో రజతం సాధించింది. ఫైనల్లో మిలాన సాఫ్రనోవా(కజకిస్థాన్)కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ 2-3 తేడాతో ఓటమి చవిచూసింది. అంతకుముందు ప్రపంచ మాజీ ఛాంపియన్​ మేరీ కోమ్​ కూడా 51 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది.

Last Updated : May 30, 2021, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details