రెజ్లర్ సుశీల్ కుమార్ (sushil kumar wrestler)పై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తుది నివేదిక ప్రకారం అతడిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ రిపోర్టును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్వీర్ సింగ్ లంబాకు అందించారు.
రెజ్లర్ సుశీల్‌పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్ - sushil kumar wrestler
మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్ సుశీల్ కుమార్ (sushil kumar wrestler)తో పాటు మరో 19మందిపై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో సుశీల్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
రెజ్లర్ సుశీల్ కుమార్
మే 4న దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం వద్ద మల్లయోధుడు సాగర్ రానాను సుశీల్‌తో పాటు అతని సన్నిహితులు హత్య చేశారు. ఈ దాడిలో సాగర్ అక్కడిక్కడే మృతి చెందగా, అతడి మిత్రులు సోను, అమిత్ కుమార్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇందులో 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న ఆ 'ఒక్కటి'!