టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం.. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆగస్టు 15.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ఒలింపిక్ బృందాన్ని ముఖ్య అతిథులుగా ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమం అనంతరం.. తన నివాసంలో ఒక్కో అథ్లెట్‌తో సమావేశమవుతారని అధికార వర్గాలు తెలిపాయి.
" మన ఆటగాళ్లను చూసి జాతి గర్విస్తోంది. గెలుపోటములు జీవితంలో ఓ భాగం. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు గట్టిగా పోరాడింది. తర్వాత మ్యాచ్‌కు వారికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా. "
-- ప్రధాని నరేంద్ర మోదీ
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన హాకీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది భారత జట్టు. అయితే భారత్‌కు కాంస్య పతకం గెలిచే వీలుంది. ఆస్ట్రేలియా లేదా జర్మనీతో తలపడనుంది.