టోక్యో ఒలింపిక్స్.. జావెలిన్ త్రో ఫైనల్లో స్వర్ణం సాధించి అథ్లెటిక్స్‌లో 100 ఏళ్ల కలను సాకారం చేశాడు నీరజ్ చోప్డా. ఈ మేరకు నీరజ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
" ఇప్పుడే నీరజ్ చోప్డాతో ఫోన్లో మాట్లాడాను. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాను. తనకున్న స్పోర్ట్స్ టాలెంట్‌ను నిరూపించాడు చోప్రా. ఆటగాడికి ఉండాల్సిన క్రీడాస్ఫూర్తి నీరజ్ సొంతం. అతని భవిష్యత్తుకు బెస్ట్ విషెస్."
-- ప్రధాని మోదీ ట్వీట్
మూడు రోజుల క్రితం జరిగిన క్వాలిఫికేషన్‌లోనే 86.59 మీటర్ల త్రోతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే ఫైనల్స్‌లో ఆ మార్కును దాటాడు.