తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గోల్డ్​ గెలిచేశావ్​గా.. ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకో అచింత!'.. మోదీ ట్వీట్​

Achinta Modi Tweet: కామన్వెల్త్​ గేమ్స్ వెయిట్​ లిఫ్టింగ్​ విభాగంలో భారత్​కు మూడో బంగారు పతకాన్ని అందించిన అచింతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'అనుకున్న మెడల్​ గెలిచేశావుగా.. ఇప్పుడు దర్జాగా వెళ్లి మూవీ చూడు' అంటూ అచింతకు మోదీ స్పెషల్​ విషెస్​ తెలిపారు.

achinta modi tweet
achinta modi tweet

By

Published : Aug 1, 2022, 10:03 AM IST

Achinta Modi Wishes: కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్‌ లిఫ్టర్‌ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

బంగారు పతకాన్ని సాధించిన అచింతను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కంగ్రాట్స్​ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 'అనుకున్నది సాధించావుగా.. ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో' అంటూ ట్వీట్​ చేశారు మోదీ.

మోదీ ట్వీట్​

కామన్వెల్త్​ క్రీడలకు ముందు ఆటగాళ్లతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఆ సమయంలో అచింతతో జరిగిన సంభాషణను మోదీ గుర్తుచేసుకున్నారు. "కామన్వెల్త్ గేమ్స్‌కు ఆటగాళ్ల బృందంతో మాట్లాడాను. ఆ సమయంలో అచింతతో కూడా సంభాషించాను. అతడికి తన తల్లి, సోదరుడు ఇచ్చిన మద్దతు గురించి చర్చించాము. అతడికి సినిమాలు ఇష్టమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అచింతకు సమయం దొరికింది. సినిమాలు చూసుకోవచ్చు" అని మోదీ ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

'నా సోదరుడికి ఈ పతకం అంకితం'.. పతకం గెలుచుకున్న అనంతరం అచింత మీడియాతో మాట్లాడాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో పోరాటాలను అధిగమించి ఈ పతకాన్ని సాధించాను. ఈ బంగారు పతకాన్ని నా సోదరుడితో పాటు కోచ్‌లకు అంకితం చేస్తాను. ఇక నా టార్గెట్​ ఒలింపిక్స్. అందుకు ప్రాక్టీస్​ మొదలుపెడతాను" అని అచింత చెప్పాడు.

అచింత షూలి

రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలోకి అచింత.. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేసిన అచింత.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్‌ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్‌ చేసి మొత్తం మీద 313 కేజీలతో (క్రీడల రికార్డు) పసిడి సొంతం చేసుకున్నాడు. హిదాయత్‌ (303 కేజీలు, మలేసియా) రజతం గెలవగా.. షాద్‌ (298 కేజీలు, కెనడా) కాంస్యం సాధించాడు. 2021 జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో 2019, 2021ల్లో ఛాంపియన్‌గా నిలిచాడు.

ఇవీ చదవండి:కామన్వెల్త్​లో భారత్​ జోరు.. పసిడి పట్టేసిన జెరెమీ, అచింత.. ఫైనల్లోకి శ్రీహరి

అదరగొట్టిన అచింత.. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పసిడి

ABOUT THE AUTHOR

...view details