ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతర్జాల వేదికగా నిర్వహించిన ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విజేతలను అభినందించారు.
'దేశం మిమ్నల్ని చూసి గర్వపడుతోంది' - latest chess news updates
చెస్‌కు తలమానికమైన ఒలింపియాడ్‌లో ఛాంపియన్లుగా నిలిచిన భారత ఆటగాళ్లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా విజేతలకు అభినందనలు తెలిపారు.
చెస్
ఇదీ చూడండి:'విజేతలుగా ఎగిరాం.. అందనంత ఎత్తుకు'
క్రీడాకారుల కృషి, అంకితభావం ప్రశంసనీయమని, మరికొంత మంది ఆటగాళ్లకు వారు ప్రేరణగా నిలుస్తారని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ స్పందిస్తూ.. "అద్భుతమైన మీ ప్రదర్శన చూసి దేశం మురిసిపోయింది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. రష్యా జట్టుకు కూడా అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా చెస్ విజేతలను అభినందించారు.