PM Modi Meets Para Athletes : చైనా వేదికగా జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో సత్తా చాటి.. పతకాలు సాధించిన ఆటగాళ్లను మోదీ కలిసి.. అభినందించారు. కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్‌ఠాకూర్‌తో కలిసి అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారి విజయ ప్రస్థానాన్ని అడిగి తెలుసుకున్నారు. చాలామంది ఆటగాళ్లకు మోదీ ఆటోగ్రాఫ్ ఇవ్వగా.. మరికొందరితో మోదీ ఫొటోలు దిగారు. కొందరు అథ్లెట్లు మోదీకి.. బహుమతులను ఇచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా భారత్ ఈ సారి పారా ఆసియా గేమ్స్‌లో 111 పతకాలు (Para Asian Games 2023 Medal Tally India) సాధించి.. సత్తా చాటింది. పారా ఆటగాళ్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని.. వారు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.
"క్రీడల్లో ఓటమి ఉండదు. గెలవడం లేదా నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మీ (పారా అథ్లెట్లు) విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుంది. దేశ ప్రజల గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజుల్లో క్రీడలను కూడా వృత్తిగా అంగీకరిస్తున్నారు. పారా అథ్లెట్లు క్రీడల్లో సాధించిన విజయం క్రీడల్లో మాత్రమే స్ఫూర్తిదాయకం కాదు. అది అందరి జీవితాల్లో కూడా స్ఫూర్తిదాయకమే. 'ప్రభుత్వం కోసం క్రీడాకారులు' అనేది మునుపటి విధానం. ఇప్పుడు అది 'అథ్లెట్ల కోసం ప్రభుత్వం'గా మారింది. అథ్లెట్లు కేంద్రంగా ప్రస్తుత ప్రభుత్వం విధానం ఉంది. క్రీడాకారుల్లో ఉన్న పొటెన్షియల్, ఫ్లాట్‌ఫామ్ కలిస్తే.. పెర్ఫామెన్స్‌తో సమానం. అయితే పొటెన్షియల్‌కు సరైన ప్లాట్‌ఫామ్ లభిస్తే పర్ఫామెన్స్ ఊపందుకుంటుంది. ప్రతి టోర్నమెంట్లో మీరు సాధించే విజయం.. మానవ కలల గెలుపు"
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని