పారాలింపిక్స్(tokyo paralympics)లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింఘరాజ్ అధానా(singhraj adhana) కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అధానాను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
"అద్భుత ప్రదర్శన చేశావు సింగ్‌రాజ్ అధానా. ప్రతిభగల భారత షూటర్ దేశానికి కాంస్యం తీసుకొచ్చాడు. ఈ విజయాన్ని అందుకునేందుకు అతడు చాలా శ్రమించాడు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు గెలవాలని కోరుకుంటున్నా."
-ప్రధాని మోదీ
మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు అధానా. తద్వారా కాంస్యం దక్కించుకున్నాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్ మనీశ్ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో చైనా క్రీడాకారుడు డిఫెడింగ్ ఛాంపియన్ చావో యాంగ్ (237.9 ) పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్ జింగ్ (237.5) రజతం అందుకున్నాడు.