భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్.. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ఆ ఒలింపిక్స్‌లో పాల్గొనే ముందు మూడు నెలల పాటు శిక్షణ శిబిరంలో చేసిన ప్రాక్టీస్ వల్లే ఆ విజయం వరించిందని తెలిపింది.
"రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ముందు విదేశాల్లోని శిక్షణ శిబిరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన సహ క్రీడాకారులతో కలిసి బాగా ప్రాక్టీస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ పతకాలు సాధించిన వాళ్లతో కలిసి నేను శిక్షణ చేశాను. ఆ సమయంలో ఆటకు సంబంధించి ఎన్నో మెలకువలను నేర్చుకున్నాను. దీంతో ఎంతో అనుభవం వచ్చింది. పోరులో దిగినప్పుడు కూడా చివరివరకు దూకుడుగా ఆడాను. అందుకే నేను కాంస్య పతకాన్ని సాధించగలిగాను. ఆ మూడు నెలల శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది."
-సాక్షి మాలిక్, స్టార్ రెజ్లర్.
సాక్షి అర్హత సాధించిన తీరు
మొదట రెజ్లింగ్ మహిళల పోటీ ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ స్వీడన్‌కు చెందిన జొహన్నాపై 5-4 తేడాతో గెలుపొంది ప్రి క్వార్టర్స్ కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో మల్డోవాకు చెందిన మారియానాపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో రష్యాకు చెందిన వలేరియా కబ్లోవాతో తలపడి ఓడిపోయింది. అనంతరం వలెరియా కబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడం వల్ల సాక్షికి రెపిచేజ్‌లో పోటీపడే అవకాశం లభించింది. ఇందులో సాక్షి.. మంగోలియాకు చెందిన ఒర్ఖాన్ పై 12-3 తేడాతో గెలుపొందింది. దీంతో కాంస్య పోరుకు అర్హత సాధించింది. ఈ పోరులో కిర్గిస్థాన్‌కు చెందిన టైనైబెకోవాపై 8-5తేడాతో గెలుపొంది రియో ఒలింపిక్‌లో భారత్‌కు తొలి పతకం తీసుకొచ్చిన క్రీడాకారిణిగా నిలిచింది.
భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్.
భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్.
ఇదీ చూడండి మహిళా టీ20 ఛాలెంజ్ షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి