తెలంగాణ

telangana

ETV Bharat / sports

మా ఇద్దరిని అదోలా చూస్తున్నారు: ద్యుతి చంద్​ - ద్యుతి చంద్​ లేటెస్ట్​ న్యూస్​

ప్రేమలో ఉండి బయటి ప్రపంచానికి భయపడే వాళ్లు ధైర్యంగా ఉండాలని చెబుతోంది భారత స్ప్రింటర్​ ద్యుతి చంద్. తాను ఓ అమ్మాయితో సహజీవనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత ఆమెతో పాటు తన భాగస్వామిని ప్రజలు అదోలా చూస్తున్నారని తెలిపింది. అలా చూసే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటోంది ద్యుతి.

People Look At Me And My Partner Differently, But It Doesn't Matter: Dutee Chand
మా ఇద్దరిని అదోలా చూస్తున్నారు: ద్యుతి చంద్​

By

Published : Jul 2, 2020, 8:31 AM IST

అమ్మాయితో సహజీవనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తనతో పాటు తన భాగస్వామిని ప్రజలు అదోలా చూడడం మొదలెట్టారని భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ తెలిపింది. తమ వైపుగా తేడాగా చూసే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తాను స్వలింగ సంపర్కురాలినని గతేడాది ద్యుతి ప్రకటించింది.

"ఒకరు ఎవరితోనైనా, ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. కులం, మతం లేదా లింగం ఆధారంగా దాన్ని నిర్ణయించలేరు. నా భాగస్వామి నాకెప్పుడూ మద్దతుగానే నిలిచింది. అందుకే నా జీవితంలో ఆమె ఉండాలని కోరుకున్నా. ప్రజలు మా వైపు తేడాగా చూడొచ్చు లేదా మమ్మల్ని గే, లెస్బియన్‌ అంటూ పిలవొచ్చు. కానీ మేం ఒకటిగా బతికినన్ని రోజులు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమలో ఉండి బయటి ప్రపంచానికి భయపడే వాళ్లు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మంచి విషయాలను అంగీకరించేందుకు లోకం ఎప్పుడూ సమయం తీసుకుంటుంది. కాబట్టి భయపడకూడదు. అది మీ జీవితం, మీ ఆనందం" అని ద్యుతి చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి... పతకం కోసం పోరుబాట.. ఉద్యోగం కోసం వెతుకులాట

ABOUT THE AUTHOR

...view details