Peng Shuai: చైనా ఉన్నతాధికారి ఒకరు.. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి మరోసారి ఖండించింది. గతంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకోవడం వల్లే ఈ ఆరోపణలు తలెత్తాయని ఫ్రెంచ్ పత్రిక ముఖాముఖీలో స్పష్టం చేసింది. చైనా ఒలింపిక్ కమిటీ ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించింది.
చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైన గత శనివారం.. అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బాచ్ పెంగ్ షువాయితో మాట్లాడారని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. గత నవంబరులో సామాజిక మాధ్యమాల్లో పెంగ్ పెట్టిన పోస్టుపై ఆరా తీశారని తెలిపింది.