Bajrang Punia Defamation Case : భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు పటియాలా హౌస్ కోర్టు షాకిచ్చింది. తన కోచ్ నరేష్ దహియా వేసిన పరువు నష్టం దావా పిటీషన్‌ను పరిగణనలోకి తీసుకున్న పటియాలా కోర్టు..బజరంగ్‌కు సమన్లు జారీ చేసింది. మే 10న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బజరంగ్ పునియా తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కోచ్ నరేష్ దహియా బజరంగ్‌పై నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో పిటీషన్ పరిశీలించిన కోర్టు.. బజరంగ్‌ను సెప్టెంబర్ 6న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
Bajrang Punia Defamation Case :పరువు నష్టం కేసులో బజరంగ్‌కు కోర్టు సమన్లు.. తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్స్..
Bajrang Punia Defamation Case : భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు పటియాలా హౌస్ కోర్టు షాకిచ్చింది. మే 10న జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రెస్ మీట్లో తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కోచ్ నరేష్ దహియా వేసిన పిటీషన్‌ను పరిగణనలోకి తీసుకుని బజరంగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
భారత్‌కు బజ్‌రంగ్, వినేశ్.. అందుకోసమేనా?
మరోవైపుఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ ఆసియా గేమ్స్ కోసం కిర్గిస్తాన్‌లో శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే తనకు నిర్ణయించిన తేదీల (ఆగస్టు 5, 6) కంటే ముందుగానే బజరంగ్ ట్రైనింగ్ నుంచి తిరిగి రావడం గమనార్హం.
ఇక ఆగస్టు 12న రెజ్లింగ్ సమాఖ్య ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందులో హరియణాకు చెందిన రెజ్లర్ అనిత షియెరాన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో అనిత బంగారు పతకాన్ని సాధించారు. అయితే ఈ సారి అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. దీంతో మొత్తం 15 పోస్టులకు 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలా అధ్యక్ష పదవికి నలుగురు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం ముగ్గురు, వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆరుగురు, ప్రధాన కార్యదర్శి పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.