Parupalli Kashyap Injury: కామన్వెల్త్ గేమ్స్ మాజీ ఛాంపియన్, షట్లర్ పారుపల్లి కశ్యప్ కాలిపిక్క గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఆరువారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నాడు. విశ్రాంతి అనంతరం ట్రైనింగ్ ప్రారంభించడంపై పునఃపరిశీలన చేయాలని తెలిపాడు.
"హైదరాబాద్ ఓపెన్‌లో ఆడాను. తొలి రౌండ్లోనే నాకు గాయమైంది. బాగా రాణిస్తున్నా అని భావించే సమయంలోనే ఇలా జరగడం బాధాకరం."
--కశ్యప్, షట్లర్.
బహుషా వయసు కారణంగా ఈ ఫిట్నెస్ సమస్యలు వస్తున్నాయేమోనని కశ్యప్ అనుమానం వ్యక్తం చేశాడు. ట్రైనింగ్‌లో ఏం జరుగుతుందో పునఃపరిశీలన చేసుకోవాలని అన్నాడు. అయితే.. 2014 కామన్వెల్త్లో స్వర్ణం సాధించిన తర్వాత కశ్యప్ తరచూ ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు.
హైదరాబాద్‌లో డిసెంబర్ 24-30 మధ్య జరిగిన ఆల్ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో కశ్యప్‌కు గ్రేడ్-1 స్థాయిలో గాయమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడు ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఇండియా ఓపెన్ సూపర్ 500తో సహా మరో రెండు టోర్నీలకు దూరంకానున్నాడు.
ఇదీ చదవండి:
ఆల్ఇంగ్లాండ్ ఓపెన్: సింధు విజయం- శ్రీకాంత్, కశ్యప్ ఔట్