తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్‌ కౌంట్‌డౌన్‌ షురూ.. రూ.67 వేల కోట్లతో ఏర్పాట్లు - పారిస్​ ఒలింపిక్స్​ 2024 ఫొటోలు

Paris Olympics 2024 Countdown : వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈఫిల్‌ టవర్‌ వద్ద కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను ఏర్పాటు చేశారు. 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ విశ్వ క్రీడల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ. 67 వేల కోట్లకు పైగా ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు.

Paris Olympics 2024 Countdown
Paris Olympics 2024 Countdown

By

Published : Jul 22, 2023, 2:22 PM IST

Paris Olympics 2024 Countdown : వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ కింద కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒలింపిక్స్‌ రింగ్స్‌ను సిటీ హాల్‌ ముందు ఉంచారు. 2024 జులై 26న పారిస్‌లో ఒలింపిక్స్‌ ఆరంభంకానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. పారిస్‌లోని సీన్‌ నది పక్కన ఒలింపిక్స్‌ ఆరంభోత్సవానికి సంబంధించిన సాంకేతిక రిహార్సల్స్‌ను నిర్వహించారు. 39 బోట్లు ఇందులో పాల్గొన్నాయి. సీన్‌ నది వద్ద వచ్చే ఏడాది జరిగే వేడుకలను 6 లక్షల మంది వీక్షించే అవకాశం ఉంది.

paris olympics 2024 Dates : విశ్వక్రీడల కోసం కోటి 30 లక్షల మంది పారిస్‌కు విచ్ఛేస్తారని అంచనా వేస్తున్నారు. అంత మంది సందర్శకులకు సరిపడేలా పారిస్‌లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రవాణా వ్యవస్థ, భద్రత, కేటరింగ్‌ వంటి వాటిపై అధికారులు దృష్టిపెట్టారు. కోటి 30 లక్షల మందికి భోజన సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒలింపిక్స్‌ వల్ల పారిస్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల్లో విక్రయాలు భారీగా పెరిగి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరనుందని ఫ్రాన్స్‌ సర్కారు భావిస్తోంది.

Paris Olympics 2024 Revenue And Expenditure : ఒలింపిక్స్‌ కారణంగా వచ్చే పర్యటకుల వల్ల దాదాపు రూ. 31,980 కోట్ల రూపాయల ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. విశ్వక్రీడల కోసం రూ.67 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రజా రవాణాను 15 శాతం పెంచుతున్నారు. కొత్తగా మెట్రో స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. పారిస్‌లో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జులై 26న ఆరంభమై ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. పారాలంపిక్స్‌ను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహిస్తారు.

ఒలింపిక్స్​​ తేదీల్లో మార్పు లేదు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపించిన సమయంలో.. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్​ 2021లో జరిగాయి. అయితే దీని ప్రభావం 2024లో జరిగే పారిస్​ ఒలింపిక్స్​పై ఏ మాత్రం ఉండదని ఒలింపిక్​ కమిటీ నిర్వహకులు టోనీ ఎస్టాంగ్యుయెట్​ 2020లో తెలిపారు. తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని పోటీలు.. యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఆయన అన్నట్లే వచ్చే ఏడాది జరిగే పారిస్​ ఒలింపిక్స్​ తేదీల్లో మార్పు చేయలేదు. వచ్చే ఏడాది జులై 26న విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details