తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Paralympics: భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు - పారాలింపిక్స్

యతిరాజ్ సుహాస్.. పారాలింపిక్స్​లో రజతం గెలిచి అరుదైన ఘనత సాధించారు. ఈ టోర్నీలో పాల్గొని పతకం గెలిచిన తొలి కలెక్టర్​గా నిలిచారు. ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారే కావడం మరో విశేషం.

Suhas Yathiraj clinches silver in badminton SL4 class
భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు

By

Published : Sep 5, 2021, 11:51 AM IST

టోక్యో పారాలింపిక్స్​ బ్యాడ్మింటన్​లో రజతం గెలిచి భారత్​కు మరో పతకం సాధించిపెట్టారు యతిరాజ్ సుహాస్​. టోర్నీలో తన చారిత్రక ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించారు. పారాలింపిక్స్​లో పతకం గెలిచిన తొలి కలెక్టర్​గానూ సరికొత్త రికార్డు సృష్టించారు.

యతిరాజ్ రజతం గెలిచి అరుదైన ఘనత సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలోనే పతకం గెలిచిన తొలి ఐఏఎస్ అధికారిగా అవతరించారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లోని గౌతమ్ బుద్ధ నగర్​ కలెక్టర్​గా విధులు నిర్వహిస్తూనే కఠోరంగా శ్రమించి పారాలింపిక్స్​లో సరికొత్త చరిత్ర సృష్టించారు. కంప్యూటర్​ ఇంజినీర్​ అయిన యతిరాజ్​.. ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. గతేడాది నోయిడాలో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. కరోనా క్లిష్ట సమయంలో చక్కగా విధులు నిర్వర్తించారు.
  • భారత్​ కోసం పతకం సాధించడం గర్వంగా ఉందని, కానీ స్వర్ణం గెలవలేకపోయినందుకు కాస్త నిరాశగా ఉందని మ్యాచ్ అనంతరం యతిరాజ్ చెప్పారు. తొలి సెట్ గెలిచాక రెండో సెట్లోనే మ్యాచ్ ముగిస్తే బాగుండేదని అన్నారు.
  • యతిరాజ్ సతీమణి రితు సుహాస్​ కూడా ఐఏఎస్ అధికారే కావడం మరో విశేషం. గజియాబాద్ అదనపు కలెక్టర్​గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని ఉప్పొంగిపోయారు. పారాలింపిక్స్​లో భారత్​ తరఫున ఆడాలనేది ఆయన కల అని.. ఆరేళ్ల శ్రమకు అద్భుత ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
    భారత్​కు పతకం- కలెక్టర్ల ఇంట్లో సంబరాలు
  • ఈ విజయంతో ఇద్దరి కలెక్టర్ల కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులు మిఠాయిల పంచి, డ్యాన్స్ చేసి సంతోషంలో మునిగిపోయారు.
  • పారాలింపిక్స్​లో భారత్​కు రజతం సాధించి పెట్టినందుకు యతిరాజ్​కు ఫోన్ చేసి అభినందలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆటగాళ్లు ఫలితాల గురించి కాకుండా ఆట మీదే పూర్తిగా దృష్టి సారించాలని టోర్నీకి ముందు మోదీ చెప్పిన మాటలను యతిరాజ్​ ప్రస్తావించారు.
  • యతిరాజ్​కు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ కూడా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ విజయం పట్ల దేశం గర్విస్తోందని కొనియాడారు.

టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ ఎస్​ఎల్​4 విభాగంలో ఫ్రాన్స్ ఆటగాడు, వరల్డ్ నంబర్​-1 లుకాస్​ మజుర్​తో యతిరాజ్​ హోరాహోరీగా తలపడ్డారు. తొలిసెట్​ను గెలిచి ప్రపంచ ​ ఛాంపియన్​కు షాకిచ్చారు. అయితే రెండో సెట్​ను 17-21 తేడాతో, మూడో సెట్​ను 15-21తో కోల్పోయాడు. కానీ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. 62 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. పసిడి పతకం గెలిచిన మజుర్​.. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్. యూరోపియన్ ఛాంపియన్​షిప్​లోనూ మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి:Paralympics: సిక్స్​లు కొట్టాల్సింది​.. పారాలింపిక్స్​ పతకం పట్టేశాడు!

ABOUT THE AUTHOR

...view details