పారా అథ్లెట్లు దేశానికి బలం, స్ఫూర్తి అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సాధారణ క్రీడాకారులతో పాటు వారిని ప్రభుత్వం సమానంగా చూస్తోందని స్పష్టం చేశారు. 29వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వర్చువల్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దీపా మాలిక్, దేవేంద్ర జజారియా, పారుల్ పార్మర్, శతాబ్ది అశ్వతి తదితరులు పాల్గొన్నారు.
"మా పారా అథ్లెట్లు, 'దివ్యాంగ్' వారియర్స్ మా బలం. వారే మాకు స్ఫూర్తినిచ్చారు. క్రీడా మంత్రిత్వశాఖ.. మిగతా క్రీడాకారులతో పాటే వారిని సమానంగా చూస్తోంది. గుర్తింపు, ప్రైజ్మనీ విషయంలో వారిని అదే రీతిలో గౌరవిస్తున్నాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లోని పారా అథ్లెట్లకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను"