కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ శ్రీ పురస్కారాలకు ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. క్రికెటర్ జహీర్ ఖాన్, జాతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, మాజీ హాకీ ప్లేయర్ ఎమ్పీ గణేష్, షూటర్ జీతూరాయ్, మహిళల జట్టు ఫుట్‌బాల్ సారథి బెంబమ్ దేవీ, ఆర్చరీ క్రీడాకారుడు తరుణ్‌దీప్ రాయ్‌లను ఈ అవార్డు వరించింది.
బాక్సర్ మేరీకోమ్ దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు షట్లర్ పీవీ సింధుకు పద్మభూషణ్ లభించింది.