టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్ క్రీడలకు విదేశీ అభిమానులను నిషేధించింది ఒలింపిక్స్ నిర్వహక కమిటీ. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ, జపాన్ ప్రభుత్వం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.