టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ సిద్ధమవుతోంది. మహా క్రీడా సంగ్రామం మరో వంద రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యోలో.. ఒలింపిక్స్ మస్కట్, చిహ్నాలను నిర్వహణ కమిటీ ఆవిష్కరించింది. కరోనా రక్కసి ముప్పు పొంచి ఉన్న వేళ వైరస్ నిరోధానికి ఆరోగ్య సిబ్బంది శ్రమిస్తున్నట్లు టోక్యో గవర్నర్ యురికో తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ - latest news about olympics
టోక్యో ఒలింపిక్స్‌కు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యోలో లోగోతో పాటు మస్కట్, చిహ్నాలను ఆవిష్కరించింది ఒలింపిక్ నిర్వహణ కమిటీ.
టోక్యో ఒలింపిక్స్ 2020, లోగో, మస్కట్ ఆవిష్కరణ
కరోనా కేసులు పెరుగుదల, క్రీడల పేరుతో కుంభకోణాలు జరిగాయని.. ప్రజల నుంచి ఒలింపిక్స్ నిర్వహణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ సంస్థలు నిర్వహించిన ఒపినీయన్ పోల్స్‌లో.. 80శాతం జపాన్ ప్రజలు ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతున్నట్లు తేలింది. అయినప్పటికీ ఒలింపిక్స్‌ను నిర్వహించాలని నిర్వహణ కమిటీ పట్టుదలగా ఉంది.
ఇదీ చదవండి:'మహిళా క్రికెట్ జట్టుకు కోచ్ కావలెను'