ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆధ్వర్యంలోని భారత జట్టు ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో పతకంపై గురిపెట్టింది. శుక్రవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. చైనా, రష్యా, అమెరికా కూడా పతకం రేసులో ముందు వరుసలో ఉన్నాయి.
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా..! - ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ 2020 న్యూస్
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా పాల్గొననుంది ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బృందం. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీలో భారత్ ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా..!
ఆనంద్‌తో పాటు పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ (కెప్టెన్), కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ప్రజ్ఞానందలతో భారత జట్టు పటిష్ఠంగా ఉంది. పూల్-ఎలో భారత్, చైనా, జార్జియా, వియత్నాం, జర్మనీ, ఇరాన్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, జింబాబ్వేలు ఉన్నాయి. మూడు పూల్‌ల నుంచి మూడేసి అగ్ర జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.