కరోనాపై పోరాటానికి అండగా నిలిచేందుకు దేశంలోని అగ్రశ్రేణి చెస్ ప్లేయర్లు పాల్గొన్న ఆన్‌లైన్ చెస్ ఎగ్జిబిషన్ టోర్నీ ద్వారా పోగైన రూ.4.5 లక్షల విరాళాలను ప్రధానమంత్రి సహాయనిధికి అందించారు. విరాళాల సేకరణ కోసం ఆదివారం జరిగిన ఆ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్, విదిత్ గుజరాతి, అధిబన్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక.. చెస్.కామ్ వేదికగా ఉత్సాహవంతులతో పోటీపడ్డారు.
ఆన్లైన్లో చెస్ ఆడి.. రూ.4.5 లక్షల విరాళం! - హరికృష్ణ చెస్
కరోనాపై పోరులో పలువురు ప్రముఖులు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత అగ్రశ్రేణి చెస్ ప్లేయర్లు.. చెస్.కామ్ వేదికగా పోటీలు నిర్వహించి వాటి ద్వారా వచ్చిన రూ.4.5 లక్షల రూపాయలను పీఎం-కేర్స్‌కు విరాళంగా అందించారు.
ఆన్‌లోన్‌లో చెస్ ఆడి.. రూ.4.5 లక్షల విరాళం!
విరాళాల సేకరణ కోసం టోర్నీలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని హారిక పేర్కొంది. "ఓ మంచి పని కోసం ఇంట్లో ఉంటూనే ఆట ఆడుతూ విరాళాలు సేకరించడం గర్వంగా ఉంది. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. విరాళాలు సేకరించడమే అంతిమ ధ్యేయంగా టోర్నీ జరిగింది" అని హారిక చెప్పింది.
ఇదీ చూడండి.. టాప్-5: టీమ్ఇండియా భారీ ఛేదనలు
Last Updated : Apr 13, 2020, 11:58 AM IST