తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఒలింపిక్స్​ జరుగుతాయి.. వదంతులు నమ్మొద్దు' - కేంద్ర క్రీడా శాఖ మంత్రి

టోక్యో ఒలింపిక్స్​ ఈ ఏడాది తప్పకుండా జరుగుతాయని తెలిపారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు. వాటిపై వచ్చే పుకార్లను నమ్మొద్దన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వాకథాన్​లో ఆయన పాల్గొన్నారు.

Olympics on track, don't believe rumours, says Rijiju
'టోక్యో ఒలింపిక్స్​పై వదంతులు నమ్మొద్దు'

By

Published : Mar 8, 2021, 10:37 AM IST

టోక్యో ఒలింపిక్స్​పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఈ ఏడాది ప్రకటించిన తేదీల ప్రకారమే ఒలింపిక్స్​ను నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఆ ఆటలపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు మంత్రి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. యువజన వ్యవహారాల కార్యదర్శి ఉషా శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాకథాన్​లో రిజిజు పాల్గొన్నారు.

గతేడాది టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్​ను కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు ఈ క్రీడలను నిర్వహించనున్నారు.

ఒలింపిక్స్​ గురించి ఏమైనా వదంతులు ఉంటే వాటిని నమ్మొద్దు.. ఈ మెగా ఈవెంట్​ ఖరారు అయిపోయింది. ముందుగా నిర్ణయించిన విధివిధానాల ప్రకారం ఆ క్రీడలు జరుగుతాయి. త్వరలోనే తేదీల ప్రకటన వస్తుంది.

-కిరణ్​ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా దిల్లీలోని జవహర్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాకథాన్​లో రిజిజు పాల్గొన్నారు. యువజన వ్యవహారాల కార్యదర్శి ఉషా శర్మ.. ఈ వాకథాన్​కు నాయకత్వం వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, వలంటీర్లు ఈ కార్యక్రమానికి వచ్చారని తెలిపారు. మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పామని మంత్రి పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ఏ ఈవెంట్​ తీసుకున్నా.. వాటిల్లో మహిళలు ఉంటున్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. మహిళకు సమాన వేదికను కల్పిస్తున్నాం. వారు గొప్పగా రాణించాలన్నదే మా అభిమతం.

-కిరణ్​ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి.

ఒలింపిక్స్​కు వెళ్లేముందు అథ్లెట్లకు కరోనా టీకా ఇస్తామని రిజిజు తెలిపారు. వారి సంక్షేమమే మా ధ్యేయమని చెప్పారు. ప్రతి ఆటగాడికి వీలైనంత త్వరగా టీకా పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'బయో బుడగ వల్ల ఆటే కాదు బంధమూ బలపడింది'

ABOUT THE AUTHOR

...view details