Olympics India Host: వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్స్ సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకున్న నేపథ్యంలో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహణకు ముందడుగు పడినట్లు అయింది. దీనిపై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ కృషి చేస్తున్నట్లు అధ్యక్షుడు నరీందర్ ధ్రవ్ బాత్రా వెల్లడించారు.
"ఒలింపిక్స్ సెషన్ నిర్వహించేందుకు అవకాశం రావడం గర్వకారణం. భారత్‌లో ఒలింపిక్స్‌కు ఇది మంచి పరిణామం. దేశంలో 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాము. మరి కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. కాబట్టి మౌలిక వసతులకు సంబంధించి కూడా భారీగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో భారత్ క్రీడలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాను."