ఒలింపిక్స్‌లో స్టార్ రన్నర్ ఉసేన్ బోల్ట్ పరుగు గురించి వినే ఉంటారు. 100, 200, 400 మీటర్ల విభాగాల్లో మూడు ఒలింపిక్స్ల్లో మొత్తం 8 స్వర్ణాలు సాధించి, తన పేరు ప్రపంచ చరిత్రలో లిఖించుకున్నాడు. అయితే ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందాన్ని ఏ ఏడాదిలో ప్రవేశపెట్టారో మీకు తెలుసా? ఒలింపిక్స్ ఓసారి ఏకంగా 188 రోజుల పాటు జరిగాయని విన్నారా? తెలియకుంటే అయితే.. ఇది చదవాల్సిందే..
Olympics: 100 మీటర్ల పరుగు.. ఆ ఒలింపిక్స్‌తోనే మొదలు - 1908 olympics 100 metres running
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు పట్టేయాలని, విజేతగా నిలవాలని అన్ని దేశాల క్రీడాకారులు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో మెగాక్రీడల గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.
ఒలింపిక్స్
1908 లండన్ఒలింపిక్స్
- షెడ్యూల్ ప్రకారం రోమ్‌లో ఈ పోటీలు జరగాలి. కానీ 1906లో మౌంట్ వెసూవిస్లో జరిగిన గొడవల వల్ల వేదికను లండన్‌కు మార్చారు.
- ఈ ఒలింపిక్స్ పోటీలు 188 రోజుల పాటు జరిగాయి. 1908 ఏప్రిల్ 27న ప్రారంభోత్సవం జరిగినప్పటికీ జులై 13 వరకు పోటీలే మొదలుకాలేదు. అదే ఏడాది అక్టోబరు 31న హాకీ ఫైనల్‌తో ఒలింపిక్స్ ముగిసింది.
- తొలిసారి ఇండోర్ స్పేస్‌లో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. దాదాపు 66 వేలమంది ప్రేక్షకులు పాల్గొని, పోటీల్లో పాల్గొన్న స్విమ్మర్లను ఉత్సాహపరిచారు.
- ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన అథ్లెట్లు.. తమ జాతీయ జెండా పట్టుకుని పరేడ్‌లో పాల్గొనే విధానాన్ని ఈ ఒలింపిక్స్‌తోనే ప్రవేశపెట్టారు.
- ఈ ఒలింపిక్స్‌తోనే మారథాన్‌ను 195 మీటర్లు పెంచి, నిర్వహించారు. ఆ తర్వాత 1924 ఒలింపిక్స్ నుంచి మారథాన్ దూరం 42.195 కిలోమీటర్లుగా అధికారికంగా మార్చేశారు.
- యూఎస్ఏ జట్టు తరఫున 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించిన జాన్ టేలర్.. ఈ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయుడుగా నిలిచాడు.
- తొలిసారి 100 మీటర్ల పరుగులు ఈ ఒలింపిక్స్‌లోనే ప్రవేశపెట్టారు. దీనితో పాటు 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల రిలేను పరిచయం చేశారు. దీనికి 'ద ఒలింపిక్ రిలే' అనే పేరు కూడా పెట్టారు.
- ఈ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా 'ఆస్ట్రేలేసియా' పేరుతో బరిలో నిలిచాయి.
ఇవీ చదవండి: