తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: మ్యాచ్​లు ఓడినా.. పతకం గెలిచిన అమెరికా! - 2021 టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​ జులై 23న ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేశారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో గతంలో ఈ విశ్వ క్రీడల సందర్భంగా జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి మీరూ తెలుసుకోండి.

1932 los angeles oympics, 1936 berlin olympics
1932 లాస్​ ఏంజెల్స్ ఒలింపిక్స్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్

By

Published : Jul 18, 2021, 5:39 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు సమయం దగ్గర పడుతోంది. మరో ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గతంలో విశ్వక్రీడల​ సందర్భంగా జరిగిన ఆసక్తికర అంశాలు, విశేషాలు, సరదా సన్నివేశాలు మీకోసం..

లాస్​ ఏంజెల్స్​ ఒలింపిక్స్​-1932

  • మొట్టమొదటి సారిగా బల్ద్విన్​ హిల్స్​లో ఒలింపిక్​ విలేజ్​ను నిర్మించారు. ఇక్కడ ఉండటానికి పురుషులకు అవకాశమిచ్చారు. మహిళ అథ్లెట్లను మాత్రం హోటళ్లలో ఉంచారు.
  • బంగారు పతకంతో పాటు వెండి, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు మెడల్స్​ ఇవ్వడం కోసం ఒకే పోడియంను ఉపయోగించడం లాస్​ ఏంజెల్స్​లోనే తొలిసారి.
  • స్వర్ణం సాధించిన క్రీడాకారుడి దేశానికి సంబంధించి జాతీయ గీతాన్ని వినిపించడం, జెండాను ప్రదర్శించడం.. ఈ విశ్వక్రీడల నుంచే మొదలైంది.
  • ఈ ఒలింపిక్స్​లో హాకీలో భారత్​, అమెరికా, జపాన్​ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ఇండియాతో 1-24తో, జపాన్​తో 2-9 తేడాతో ఓడిపోయింది యూఎస్​. అయినప్పటికీ కాంస్య పతకం గెలుచుకుంది అమెరికా.
  • ఒలింపిక్​ బౌలేవార్డ్ అనేది లాస్​ ఏంజెల్స్​లోని ఒక ప్రధాన రహదారి. 1932కి పూర్వం దీనిపేరు 10వ వీధి అని ఉండేది. ఇక్కడ ఒలింపిక్స్​ క్రీడలు జరిగిన దానికి గౌరవంగా పేరు మార్చారు.
  • ఈ ఒలింపిక్స్​లో 3000 మీ. పరుగులో ఒక తప్పిదం జరిగింది. దీంతో పోటీలో పాల్గొన్న అథ్లెట్లు 3,460 మీ. పరుగెత్తాల్సి వచ్చింది.

ఇదీ చదవండి:Olympics: ఒలింపిక్స్​ కోసం ఇరుకు గదుల్లోనే బస!

బెర్లిన్​ ఒలింపిక్స్​-1936

  • టీవీల్లో మొట్టమొదటి సారిగా ప్రసారమైన ఒలింపిక్స్​గా బెర్లిన్ విశ్వక్రీడలు చరిత్ర సృష్టించాయి.
  • అక్కడి స్థానికులు ఒలింపిక్స్​ను వీక్షించడం కోసం 25 టీవీ రూమ్​లను ఉచితంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
  • తొలిసారిగా లక్ష సామర్థ్యంతో ట్రాక్​ అండ్ ఫీల్డ్​ స్టేడియాన్ని నిర్మించారు. దానితో పాటు ఆరు వ్యాయామశాలలు కట్టారు.
  • టార్చ్​ రిలే కార్యక్రమాన్ని తొలిసారిగా 1936 సమ్మర్​ ఒలింపిక్స్​ నుంచే ప్రారంభించారు.
  • అమెరికా అథ్లెట్​​ జెస్సి ఒవెన్స్.. స్ప్రింట్​, లాంగ్ జంప్​ విభాగాల్లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకుంది. తద్వారా బెర్లిన్​లో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది.
  • ఒలింపిక్స్​లో అత్యంత తక్కువ వయసులో స్వర్ణం గెలిచిన మహిళ అథ్లెట్​గా అమెరికాకు చెందిన మార్జోరీ గెస్ట్రింగ్(13) రికార్డు సృష్టించింది.
  • 200 మీ. బ్రెస్ట్​స్ట్రోక్​ స్విమ్మింగ్​లో కాంస్య పతకం సాధించింది డెన్మార్క్​ స్విమ్మర్​ సోరెన్సెన్​(12). వ్యక్తిగత క్రీడల్లో పతకం సాధించిన తొలి అతి పిన్న వయస్కురాలిగా సరికొత్త ఫీట్​ అందుకుంది.
  • బాస్కెట్​బాల్​, కానోయింగ్, హాండ్​బాల్​ అనే క్రీడలు ఈ ఒలింపిక్స్​లో తొలిసారిగా కనిపించాయి.
  • జపాన్​ క్రీడాకారులు పోల్ వాల్టర్స్ షుహీ నిషిదా, సుయో ఓ క్రీడలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఇద్దరి మధ్య మరో గేమ్​ను నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ, వారు అందుకు నిరాకరించారు. వెండి, కాంస్య పతకాలను ఒక్కోదాన్ని రెండుగా విభజించి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

లండన్​ ఒలింపిక్స్-1948

  • రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1936 ఒలింపిక్స్​ జరిగిన 12 ఏళ్లకు లండన్​ ఒలింపిక్స్​ జరిగాయి.
  • రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ, జపాన్​.. ఈ ఒలింపిక్స్​లో పాల్గొనలేదు.
  • ఈ ఒలింపిక్స్​కు సోవియట్​ యూనియన్ దూరంగా ఉంది. అయినా హంగేరీ, యుగోస్లేవియా, పోలాండ్ వంటి కమ్యూనిస్ట్​ దేశాలు ఈ విశ్వక్రీడల్లో పాల్గొన్నాయి.
  • ఈ ఒలింపిక్స్​లో తొలిసారిగా బడ్జెట్​పై పరిమితులు విధించారు.
  • లండన్​ విశ్వక్రీడల్లో ఒలింపిక్ విలేజ్​ను నిర్మించలేదు. పురుష అథ్లెట్లు ఒక ఆర్మీ క్యాంపులో ఉండగా.. మహిళ క్రీడాకారులు సౌత్​​లాండ్​లోనీ ఓ కళాశాలలో ఉన్నారు.
  • 100 మీ., 400 మీ. రేసులో అథ్లెట్లకు మొదటి సారిగా ప్రారంభ బ్లాక్స్​ను వాడారు.
  • డచ్​ అథ్లెట్​ ఫాన్నీ బ్లాంకర్స్​ కోయిన్(30) పాల్గొన్న నాలుగు స్ప్రింట్​ ఈవెంట్లలోనూ గోల్డ్ మెడల్స్​ సాధించింది.

ఇదీ చదవండి:అథ్లెట్లకు రీసైక్లింగ్ 'బెడ్'.. ఈసారి అది కుదరదు!

ABOUT THE AUTHOR

...view details