అథ్లెటిక్స్ ఛాంపియన్, ఫిట్‌నెస్ మోడల్ మధ్య శరీర దారుఢ్యపు పోటీ జరిగితే ఎవరు గెలుస్తారు? అనే సందేహానికి సమాధానం లభించింది. అమెరికా తరపున రెండు సార్లు ఒలింపిక్స్ పరుగులో పాల్గొన్న నిక్ సైమండ్స్, ఇన్‌స్టాగ్రామ్ మోడల్ క్లెయిరీ థామస్ కలిసి ఓ వర్కవుట్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. బయో కెమిస్ట్రీలో డిగ్రీ ఉన్న నిక్, రెండు సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇక 7.7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న క్లెయిరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫిట్‌నెస్ సంచలనం. స్వతహాగా అథ్లెట్ అయిన క్లెయిరీకి కఠినమైన వర్కౌట్‌లు కొట్టిన పిండి.
ప్లేయర్ X మోడల్ ఫిట్‌నెస్ ఛాలెంజ్.. గెలుపెవరిది? - nick symmonds fitness challenge
ఫిట్‌నెస్ మోడల్‌గా పేరుతెచ్చుకున్న క్లెయిరీ థామస్, 2013 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన నిక్ సైమండ్స్ ఓ వర్కవుట్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అందులో వీరిద్దరూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ ఛాలెంజ్‌లో పోటీదారులు వ్యాయామంతో పాటు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్ధులకు చేయటం కష్టం అయ్యే విధంగా వివిధ టాస్క్‌లను ఇవ్వాలి. ఈ పోటీలో వీరిద్దరూ పులప్స్, తాడు ఎక్కడం నుంచి అత్యంత కష్టమైన 'మ్యాక్స్ ఎల్ సిట్ హోల్డ్' వరకు ప్రదర్శించారు. ఈ పోటీకి సంబంధించిన వీడియోను నిక్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్ పరంగా మంచి ఫాంలో ఉన్న నిక్, క్లెయిరీలను వీక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే ఫలితం పట్ల పలువురు ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇంతకీ ఉద్వేగం కలిగించే ఈ పందెంలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!
ఇదీ చూడండి: ఐపీఎల్‌ను మరిపించేలా.. మోతెక్కిన ఫుట్‌బాల్ స్టేడియం