తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిషేక్​​కు పసిడి... ఒలింపిక్స్​ బెర్త్​ పదిలం - gold

ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అభిషేక్​ వర్మ స్వర్ణం గెలిచాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగంలో 242.7 పాయింట్ల సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో ఒలింపిక్స్​లో చోటు ఖాయం చేసుకున్నాడు.

అభిషేక్ వర్మ

By

Published : Apr 27, 2019, 2:24 PM IST

చైనా బీజింగ్​లో జరుగుతున్న షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్​ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభిషేక్​వర్మ పసిడి కైవసం చేసుకున్నాడు. ఎనిమిది మంది తలపడిన ఫైనల్​లో 242.7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ విజయంతో ఒలింపిక్స్​ కోటాలో ఐదో స్థానాన్ని పదిల పరచుకున్నాడు అభిషేక్​వర్మ. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్​ బెర్త్​ను ఇప్పటికే అన్జుమ్, అపూర్వీ చండిలా, సౌరభ్ చౌదరి, దివ్యాంశ్ ఖాయం చేసుకున్నారు.

దిల్లీలో జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అభిషేక్ విఫలమైనప్పటికీ.. ఈ టోర్నీలో సత్తాచాటాడు. రష్యాకు చెందిన ఆర్టెమ్​ 240.4 పాయింట్లతో రజతం సొంతం చేసుకోగా.. కొరియా క్రీడాకారుడు హ్యాన్​ 220 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details