Boxer Lovelina mental harrassment: కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవుతున్న దిగ్గజ బాక్సర్ లవ్లీనా సంచలన ఆరోపణలు చేసింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పలువురు అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఒలింపిక్స్‌లో తాను మెడల్ సాధించడానికి ప్రోత్సాహించిన కోచ్‌లను మారుస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కోచ్‌లను తిరిగి నియమించాలని కోరింది.
బాక్సర్ లవ్లీనా సంచలన ఆరోపణలు.. అధికారులు వేధిస్తున్నారంటూ..
Boxer Lovelina mental harrassment: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనాకు చేదు అనుభవం ఎదురైంది. కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవుతున్న తనను కొంతమంది అధికారులు మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.
"నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారు. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించడానికి ప్రోత్సాహించిన, వెన్నుదన్నుగా నిలిచిన నా కోచ్‌లను తరచూ మారుస్తున్నారు. నా ట్రైనింగ్ ప్రాసెస్‌లో, అలాగే పోటీల్లో నన్ను వేధిస్తూనే ఉన్నారు. నా కోచ్‌లలో ఒకరైన సంధ్య గురుంగ్‌జీ 'ద్రోణాచార్య' పురస్కారం గ్రహీత. వెయ్యిసార్లు చేతులు జోడించి వేడుకుంటే కానీ, నా కోచ్‌లని క్యాంప్‌లోకి అనుమతించడం లేదు. ఈ ట్రైనింగ్‌లో నేను మానసిక ఆందోళనకు గురవుతున్నాను. ఇప్పుడు నా కోచ్ సంధ్య గురుంగ్‌జీ కామన్వెల్త్ విలేజ్‌కు బయట ఉన్నారు. ఆయనకు ఎంట్రీ దొరకడం లేదు. నా ట్రైనింగ్ కూడా కేవలం ఎనిమిది రోజుల క్రితమే ప్రారంభమైంది. నా రెండో కోచ్‌ను కూడా ఇప్పుడే ఇండియాకు తిరిగి వెనక్కు పంపించారు. ఇది నన్ను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఈ కారణంగా ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నా. గత ఛాంపియన్‌షిప్‌లో నేను సరిగ్గా ప్రదర్శించకపోవడానికి కూడా ఈ రాజకీయాలే కారణం. అయనా కామన్వెల్త్ క్రీడల కోసం ఈ పాటిలిక్స్ గోడల్ని బద్దలుకొట్టి, మెడల్ సాధిస్తాను" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది.
ఇదీ చూడండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. బాధగా ఉంది: శ్రేయస్