తెలంగాణ

telangana

ETV Bharat / sports

Boxer Lovlina ramp: ర్యాంప్​పై బాక్సర్​ లవ్లీనా - లవ్లీనా ర్యాంప్​ వాక్​

Boxer lovlina ramp walk: టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన బాక్సర్​ లవ్లీనా.. నార్త్‌ఈస్ట్‌ ఫెస్టివల్‌లో భాగంగా వివాహ వస్త్రాల ప్రదర్శన కార్యక్రమంలో సంప్రదాయ అస్సాం చీరతో ర్యాంపుపై తళుక్కున మెరిసింది. ఆ కార్యక్రమంలో ఆమె ధరించిన చీర ఆకర్షణగా నిలిచింది.

Boxer lovlina ramp walk
బాక్సర్​ లవ్లీనా ర్యాంప్​ వాక్​

By

Published : Jan 10, 2022, 7:42 AM IST

Boxer lovlina ramp walk: చేతులకు గ్లోవ్స్‌తో రింగ్‌లో చిరుతలా కదులుతూ ప్రత్యర్థిపై ముష్ఠిఘాతాలు కురిపించే బాక్సర్‌ లవ్లీనా.. చీరకట్టుతో ర్యాంపుపై నడిచి ఆకట్టుకుంది. నార్త్‌ఈస్ట్‌ ఫెస్టివల్‌లో భాగంగా వివాహ వస్త్రాల ప్రదర్శన కార్యక్రమంలో ఈ టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత.. సంప్రదాయ అస్సాం చీరతో ర్యాంపుపై తళుక్కున మెరిసింది. రోజ్‌ గోల్డ్‌ సిఫినా జరీ వర్క్‌తో కూడిన ముదురు ఎరుపు రంగు చీర, దానిపై సిల్క్‌ శాలువా ధరించిన ఆమె కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొఘల్‌ సామ్రాజ్యం నాటి వస్త్రధారణ తలపించేలా ఈ చీరను లవ్లీనా కోసం రూపొందించినట్లు డిజైనర్లు చెప్పారు.

ర్యాంప్​పై బాక్సర్​ లవ్లీనా
ర్యాంప్​పై బాక్సర్​ లవ్లీనా

కాగా, లవ్లీనా.. టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించి.. ఈ మెగాటోర్నీలో మెడల్​ సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. 'మాగ్నిఫిసెంట్‌ మేరీ' తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. ఈ మెగాటోర్నీలో భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఆమె తొలి పతకం అందించింది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.

సంప్రదాయ అస్సాం చీరలో బాక్సర్​ లవ్లీనా

ఇదీ చూడండి:పతకం గెల్చిన బాక్సర్​కు రూ.కోటి - రోడ్​కు ఆమె పేరు

ABOUT THE AUTHOR

...view details