Olympic Gold medallist Ban Imrankhan: ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై అసభ్యపదజాలంతో విమర్శలు చేశాడనే కారణంతో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రషీద్ ఉల్ హసన్‌పై పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ నిషేధంపై రషీద్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై తాను అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు.
ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రషీద్ అనుచిత పదజాలం ఉపయోగించాడో లేదో తెలుసుకోవడానికి పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ విచారణ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ఇచ్చిన రెండు నోటీసులకు రషీద్ స్పందించకపోవడం వల్ల పీహెచ్‌ఎఫ్ అధ్యక్షుడి సూచనల మేరకు పదేళ్లపాటు నిషేధం విధించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను జాతీయ క్రీడల స్టాండింగ్ కమిటీకి అందించారు. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ హాకీ జట్టు బంగారు పతకం సాధించిన జట్టులో రషీద్ సభ్యుడు.