ఆగస్టు 29న హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజు పురస్కరించుకుని వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ఇవ్వనున్న ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య(కోచ్‌లకు) అవార్డుల కోసం ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేశాయి క్రీడా సంస్థలు.
రెజ్లింగ్..
రెజ్లింగ్ నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత, రెజ్లర్ రవి దాహియా, దీపక్ పూనియా, అన్షు మాలిక్, సరిత మోర్‌ను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య.
కోచ్‌లు విక్రమ్, కుల్దీప్ మాలిక్, సుజీత్ మాన్.. ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది డబ్ల్యూఎఫ్ఐ. ఇందులో కుల్దీప్ మాలిక్‌కు గతంలోనే ద్రోణాచార్య అవార్డు వరిచింది. దీంతో ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకోకపోవచ్చు.
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ (ద్రోణాచార్య)లో జాగ్రూప్ రాథి, ఆర్కే హుడా, ఆర్ఎస్ కుంద్ పేర్లను నామినేట్ చేసింది డబ్ల్యూఎఫ్ఐ.