Dutee Chand Ragging: ప్రముఖ స్ప్రింటర్ ద్యుతి చంద్.. తన కెరీర్లో ఎదుర్కొన్న ర్యాగింగ్ సమస్యను బయటపెట్టింది. భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు సీనియర్లు తనను తీవ్రంగా వేధించేవారని గుర్తుచేసుకుంది. ఇటీవలే భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజిలో 19ఏళ్ల విద్యార్థి.. ర్యాగింగ్ భూతం కారణంగా సూసైడ్ చేసుకుంది. ముగ్గురు సీనియర్లు వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన అక్కడ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ద్యుతి.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను ఓ పోస్ట్ ద్వారా తెలిపింది.
మసాజ్ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్ పెట్టారు: స్టార్ స్ప్రింటర్ ద్యుతి - Dutee Chand
Dutee Chand Ragging: దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ద్యుతి చంద్.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను బయటపెట్టింది. తనను బలవంతంగా మసాజ్ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్ పెట్టారని తెలిపింది.
"మేము కూడా ఈ స్పోర్ట్స్ హాస్టల్లో ర్యాగింగ్ సమస్యను ఎదుర్కొన్నాం. సీనియర్లు బలవంతంగా మసాజ్ చేయమని, తమ బట్టలు ఉతకమని బలవంతం చేసేవారు. దానిని వ్యతిరేకించినప్పుడు నన్ను టార్చర్ పెట్టేవాళ్లు. ఆ బాధను ఎవరి ముందు చెప్పుకోలేను. మూడేళ్లు నొప్పిని భరించా" అని ద్యుతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తాను క్రీడలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయేదని, మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపింది. కాగా, ఆమె 2006-08 వరకు ఈ స్పోర్ట్స్ హాస్టల్లో ఉంది. ప్రస్తుతం ద్యుతి.. ఈ నెల చివర్లో ప్రారంభంకాబోయే కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధమవుతోంది. ఈ పోటీల్లో సత్తాచాటాలని శ్రమిస్తోంది.
ఇదీ చూడండి: IND VS ENG: బెయిర్‌స్టోకు కోహ్లీ ఫ్లయింగ్ కిస్.. సెహ్వాగ్ ఫన్నీ కామెంట్