తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో జిమ్నాస్ట్​గా 45 ఏళ్ల భామ - ఒక్సానా చుసోవితినా

2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించింది ఉజ్బెకిస్థాన్​కు చెందిన 45 ఏళ్ల ఒక్సానా చుసోవితినా. ఈ మెగాటోర్నీలో ఎక్కువ వయసున్న జిమ్నాస్ట్​గా రికార్డు సృష్టించింది. తొలిసారి 1992 విశ్వక్రీడల్లో పోటీపడింది ఒక్సానా.

45 ఏళ్ల జిమ్మాస్ట్.. 8వ సారి ఒలింపిక్స్​కు అర్హత

By

Published : Oct 16, 2019, 1:15 PM IST

Updated : Oct 16, 2019, 2:46 PM IST

35 ఏళ్లు దాటితేనే చాలామంది క్రీడాకారులకు రిటైర్మెంట్​పై చర్చలు నడుస్తుంటాయి. అలాంటిది 45 ఏళ్లు వచ్చినా ఒలింపిక్స్​లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఉజ్బెకిస్థాన్ జిమ్నాస్టిక్స్​ క్రీడాకారిణి ఒక్సానా చుసోవితినా. తాజాగా 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించి.. ఈ ఘనత సాధించిన ఎక్కువ వయసున్న జిమ్నాస్ట్​గా రికార్డు సృష్టించింది.

1992లో తొలిసారి బార్సిలోనా వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో పోటీపడింది ఒక్సానా. ఆ పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకున్నఈ స్టార్​ ప్లేయర్​... అప్పటి నుంచి ప్రతి విశ్వక్రీడలకు అర్హత సాధించింది. తాజాగా 8వ సారి ఒలింపిక్స్​లో బరిలోకి దిగుతోంది. ఒక్సానా ఒలింపిక్స్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ట్విట్టర్లో షేర్ చేసింది.

2020 టోక్యో విశ్వక్రీడలు జరిగే సమయానికి ఆమెకు 45 ఏళ్లు నిండుతాయి. 2016 రియో ఒలింపిక్స్​ జరిగినపుడు ఆమె వయసు 41 సంవత్సరాలు. విశ్వక్రీడల్లో ఒకే ఒక్క స్వర్ణం దక్కించుకున్న ఒక్సానా... మరో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. 40 ఏళ్లు పైబడినా అదే ఉత్సాహంతో దూసుకెళ్తోంది.

ఇదీ చదవండి: గంగూలీ వల్లే భారత్​పై పాక్ ఓడింది: అక్తర్

Last Updated : Oct 16, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details