ఫిజీ ఒలింపిక్ టీంతో పాటు వచ్చే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టోక్యో ప్రయాణం నుంచి ఆయన తప్పుకున్నారు. సదరు అధికారికి పాజిటివ్‌గా తేలినట్లు ఫిజీ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ధ్రువీకరించింది. కానీ ఆ అధికారి వివరాలు వెల్లడించలేదు.
టోక్యో ఒలింపిక్(Tokyo Olympics) విధివిధానాల ప్రకారం జపాన్ ప్రయాణానికి ముందే ఫిజీ ఆటగాళ్లు, అధికారులు, సిబ్బంది 96 గంటలపాటు ఐసోలేషన్‌లో ఉన్నారు. 72 గంటల ముందే అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫిజీ టీం గురువారం రాత్రే టోక్యోకు పయణమయింది. విదేశాలలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఆటగాళ్లు సైతం టీంతో పాటే పయణమయ్యారు.
కరోనాతో ఫిజీ దేశం పోరాడుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో 65,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
షకేరి రిచర్డ్‌సన్ ఔట్..
అమెరికా స్ప్రింటర్ షకేరి రిచర్డ్‌సన్ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైంది. యుఎస్‌ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ (యుఎస్‌ఏటీఎఫ్) ప్రకటించిన 4×100 రిలే జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. గత నెలలో యుఎస్ ట్రయల్స్‌లో గెలిచిన అనంతరం నిర్వహించిన పరీక్షలో రిచర్డ్‌సన్ మార్జువానా(గంజాయి) వాడినట్లు తేలడం వల్ల నిబంధనల ప్రకారం ఆమెపై 30 రోజుల నిషేధం విధించారు. దాంతో ఆమె అప్పుడే టోక్యో 100 మీటర్ల రేసుకు దూరమైంది. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో రిలేలు (ఆగస్టు 5 నుంచి) మొదలు కావడానికి ముందే రిచర్డ్‌సన్ నిషేధం ముగియనున్న నేపథ్యంలో.. ఆమెకు రిలే జట్టు సభ్యురాలిగా పోటీపడే అవకాశం ఉంది. అయినా యుఎస్‌ఏటీఎఫ్ ఆమెను ఎంపిక చేయలేదు.
ఇదీ చదవండి:ఒలింపిక్స్ వేళ.. టోక్యోలో అత్యయిక స్థితి!
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం