Odisha Open: ఒడిశా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో హరియాణాకు చెందిన ఉన్నతి హుడా(14) సంచలనం సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టోర్నీ గెలిచిన పిన్న వయసు భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
ఆదివారం జరిగన మ్యాచ్‌లో 21 ఏళ్ల తోష్నివాల్ను 21-18, 21-11 తేడాతో ఓడించి ఒడిశా ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది.
మరోవైపు మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జంట విజయం సాధించింది. సన్యోగిత గోర్పదే, శ్రుతి మిశ్రా జోడిని 21-12, 21-10 తేడాతో ఓడించింది.
కిరణ్ జార్జ్దే..