Novak Djokovic Visa: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నేరస్థుడిగా చూడటం ఆపాలని సెర్బియా ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సెర్బియా విదేశాంగ ప్రతినిధి నెమంజ స్టరోవిక్.. జకోవిచ్‌ను వెంటనే మంచి హోటల్‌కు తరలించాలని కోరారు. వీసా రద్దు అనంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోను ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించడాన్ని ఖండించారు. ఆస్ట్రేలియాలో రాజకీయాలకు జకోవిచ్ బలయ్యాడని సెర్బియా ప్రజలు భావిస్తున్నట్లు స్టరోవిక్ తెలిపారు
"ప్రపంచంలోని ఉత్తమ క్రీడాకారుడికి తగిన వసతి కల్పించే ఏర్పాట్లు చేసే విషయమై రాయబారి ప్రత్యేకంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. జకోవిచ్‌ను నేరస్థుడిగా, అక్రమ వలసదారుడిలా చూడకూడదు."
-స్టరోవిక్, సెర్బియా విదేశాంగ ప్రతినిధి.
వ్యాక్సినేషన్ వివరాలు లేనందువల్లే..
Djokovic Australian Open 2022: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను మెల్బోర్న్లో నిలిపిపేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన సెర్బియా ఆటగాడికి ఉపశమనం లభించింది. జకోవిచ్‌ను వెంటనే తిరిగివెళ్లమనకూడదని.. సోమవారం వరకు అతడు మెల్బోర్న్లో ఉండొచ్చని సంబంధిత కోర్టు తీర్పు ఇచ్చింది.