తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​కు జకోవిచ్ దూరం​, కరోనా వ్యాక్సినే కారణం - నొవాక్ జకోవిచ్​ న్యూస్

novak djokovic us open 2022 కరోనా టీకా తీసుకోనందున త్వరలో ఆరంభమయ్యే యూఎస్​ ఓపెన్​కు దూరం కానున్నాడు దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్​. టీకా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్​లోనూ పాల్గొనలేదు.

novak djokovic us open 2022
novak djokovic us open 2022

By

Published : Aug 25, 2022, 9:24 PM IST

Novak Djokovic US Open 2022: టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఈ ఏడాదిలో చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో పోటీకి దూరం కానున్నాడు. అతను కరోనా టీకా వేసుకోకపోవడమే అందుకు కారణం. ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించే సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీకీ అతను దూరమయ్యాడు. ప్రస్తుతానికి టీకా వేసుకోని విదేశీయులకు యుఎస్‌ఏలోకి అనుమతి లేదు. దీంతో సిన్సినాటి టోర్నీ కోసం అతను అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు.

టెన్నిస్‌ టోర్నీలకు దూరమైనా సరే కానీ టీకా మాత్రం వేసుకోనని 35 ఏళ్ల జకోవిచ్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అతను ఆడకపోవడానికి కూడా అదే కారణం. అలాగే యూఎస్‌లో రెండు టోర్నీలకూ దూరమయ్యాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో 21 టైటిళ్లతో నాదల్‌ (22) తర్వాత రెండో స్థానంలో ఉన్న జకో.. యుఎస్‌ ఓపెన్‌లో ఆడాలంటే అక్కడి ప్రభుత్వం టీకా నిబంధనలు సడలించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే యుఎస్‌ టెన్నిస్‌ సంఘం కూడా తేల్చిచెప్పింది. అతను ఈ టోర్నీలో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో మెద్వెదెవ్‌ చేతిలో ఓడాడు.

ABOUT THE AUTHOR

...view details