ఉత్కంఠగా సాగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ పోరులో నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. 10వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాడు. 6-3,7-6, 7-6తో గ్రీక్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్‌పై విజయం సాధించి.. పురుషుల ఏటీపీ(అసోషియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఎదురులేని జకోవిచ్.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ కైవసం.. నెం1 ర్యాంకు సైతం.. - నొవాక్ జకోవిచ్ గ్రాండ్‌స్లామ్‌లు
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ప్రముఖ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ పదోసారి కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో స్టెఫానోస్పై విజయం సాధించిన ఈ స్టార్.. వరల్డ్ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
గతేడాది కొవిడ్ టీకా వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమయ్యాడు. అయితే ఈసారి కూడా టీకా వేసుకోలేదు. కానీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు సడలించడం వల్ల వీసా లభించింది. ఇప్పటివరకు 22 మేజర్ ఛాంపియన్‌షిప్‌లు సాధించాడు జకోవిచ్. అందులో వింబుల్డన్‌లు నుంచి 7, యూఎస్ ఓపెన్ నుంచి 2, ఫ్రెంచ్ ఓపెన్ నుంచి 2 టైటిళ్లు గెలిచాడు. ఇప్పటివరకు ఆడిన హార్డ్కోర్ట్ టోర్నమెంట్లలో 28 మ్యాచ్‌లు గెలిచాడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక ఛాంపియన్‌షిప్‌లు సాధించిన ప్లేయర్‌గా రఫాల్ నాదల్ నమోదు చేసిన రికార్డును సమం చేశాడీ సెర్బియన్ ఆటగాడు. ఇక, ఆస్ట్రేలియా ఓపెన్‌లో మొదటి సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న గ్రీక్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్‌కు చుక్కెదురైంది. ఇతడు 2021 ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా జకోవిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు.