Novak Djokovic Visa: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి మెల్‌బోర్న్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోని జకోవిచ్ బయట తిరిగితే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్‌ను డిటెన్షన్ సెంటర్‌కు తరలించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ విషయంపై జకోవిచ్ మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది!
"జకోవిచ్‌కు అనుమతిస్తే.. వ్యాక్సిన్ వ్యతిరేక భావన పెరిగిపోతుంది. అది దేశ పౌరుల్లో అనిశ్చితికి దారి తీస్తుంది"అని ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకే పేర్కొన్నారు. విచారణ కోసం ఆదివారం జకోవిచ్ ఫెడరల్ కోర్టు ముందు డిటెన్షన్ సెంటర్ నుంచే కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని సూచించారు.
జకోవిచ్‌ను డిటెన్షన్ సెంటర్‌కు తరలించడంపై సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్ స్పందించారు. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారుడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అవమానించిందని విమర్శించారు.