భారత స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 12వ విజయం నమోదు చేశాడు. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన బౌట్లో ఘనాకు చెందిన చార్లెస్ ఆడమ్‌ను చిత్తు చేశాడు. ఎనిమిది రౌండ్ల ఈ సమరంలో విజేందర్ ధాటికి ఏ దశలోనూ నిలువలేకపోయాడు చార్లెస్.
ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్‌కు వరుసగా 12వ విజయం - విజేందర్ సింగ్
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ వరుసగా 12వ సారి గెలిచాడు. ఘనాకు చెందిన చార్లెస్‌పై విజయం సాధించాడు.
![ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్‌కు వరుసగా 12వ విజయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5151033-773-5151033-1574475341638.jpg)
ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్‌కు వరుసగా 12వ విజయం
"చార్లెస్ మంచి ఫైటర్, కానీ నేను పూర్తి సన్నద్ధతతో అతడి పంచ్‌లను ఎదుర్కొన్నాను. విజయం సాధించాను. దుబాయిలో ఇలా గెలవడం సంతోషంగా ఉంది" -విజేందర్‌సింగ్, భారత స్టార్ బాక్సర్