వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఒలింపిక్‌లో పాల్గొనే అథ్లెట్ల నుంచి ఇప్పటి వరకు అభ్యర్థనలేమీ రాలేదని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌కు మరో మూణ్నెల్ల గడువు మాత్రమే ఉంది.
జపాన్‌లో టీకా తీసుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని కమిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 1 శాతం కన్నా తక్కువ ప్రజలు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని.. వ్యాక్సినేషన్‌కు మొగ్గు చూపకపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.
"కొవిడ్ టీకాలపై అథ్లెట్లకు పలు సందేహాలు ఉన్నాయి. అయితే వారు వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదని" కమిటీ ఛైర్పర్సన్ నావోకో తకాహషి తెలిపారు.
ఇదీ చదవండి:ధోనీ తల్లిదండ్రులకు కరోనా
ఈ సారి ఒలింపిక్స్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాల్సి వస్తుందేమోనని.. వ్యాక్సిన్ రోల్ అవుట్ బాధ్యత మంత్రి టారో కోనో పేర్కొన్నారు. టీకా వేసుకునే వారి సంఖ్య స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒలింపిక్స్‌కు ఇప్పటికే విదేశీ అభిమానులను నిషేధించారు. అసలు స్టేడియాల్లో సగం మంది ప్రేక్షకులైనా ఉంటారా అనేది ఊహించటం కష్టంగా మారింది. జపాన్‌లోని మెజారిటీ ప్రజలు ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కమిటీ అభిప్రాయపడింది.
ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం లేదని ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ చెబుతుంది. మరోవైపు టీకాలు వేసుకోమని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ బహిరంగంగా అథ్లెట్లను ప్రోత్సహిస్తున్నారు.
ఇదీ చదవండి:కెప్టెన్ కోహ్లీ పేరుతో సర్క్యులర్