మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు దక్కాయి. ఈ మెగాటోర్నీ ఫైనల్స్‌లో నీతూ గాంగాస్, స్వీటీ బూర చెరో గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నారు. బాక్సింగ్ 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్ తొలిసారి స్వర్ణాన్ని ముద్దాడింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీతూ గాంగాస్.. నేడు(మార్చి 25) జరిగిన ఈ తుదిపోరులో లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన ఆరో మహిళా బాక్సర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్‌కు చెందిన మేరీకోమ్ (ఆరు సార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నీతూ చేరిపోయింది.
కాగా, హరియాణాకు చెందిన నీతూ గాంగాస్.. గతేడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలను ముద్దాడింది. అలానే అదే జోరును కొనసాగిస్తూ.. మళ్లీ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దూకుడు ప్రదర్శించి గోల్డ్‌మెడల్‌ను దక్కించుకుంది. వరుసగా మూడు బౌట్లలోనూ ప్రత్యర్థిని నాకౌట్ చేసి సెమీస్ చేరిన ఆమె.. ఆ పోరులో బలమైన కజకిస్థాన్ బాక్సర్ బల్కిబెకోవాపై 5-2తో గెలిచింది. ఏడాది కాలంగా ఆటలో ఎంతో మెరుగైన నీతు.. ప్రత్యర్థిని బట్టి తన వ్యూహాలు మార్చుకుంటూ విజయాల వేటలో సాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ యూత్ ఛాంపియన్‌గా నిలిచిన 22 ఏళ్ల నీతు.. ఇప్పుడు తొలిసారి సీనియర్ టైటిల్ దక్కించుకుంది.