తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎన్​బీఏ టోర్నీలో.. నీతా అంబానీకి అరుదైన గౌరవం

శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఎన్​బీఏ టోర్నీలో రిలయన్స్ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్ నీతా అంబానీ​ అరుదైన గౌరవం అందుకోనున్నారు. తొలి గేమ్​కు మ్యాచ్​బాల్​ అందించనున్నారు. ఈ టోర్నీలో 30 జట్లు పాల్గొననున్నాయి.

By

Published : Oct 4, 2019, 5:01 AM IST

నీతా అంబానీ

నేషనల్ బాస్కెట్​బాల్ అసోసియేషన్​(ఎన్​బీఏ) ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్​ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక గౌరవాన్ని అందుకోనున్నారు. ఇండియానా పేసర్స్ - శాక్రమెంటో కింగ్స్ మధ్య జరగనున్న ప్రారంభ గేమ్​​కు మ్యాచ్​ బాల్ అందించనున్నారు.

ఈ లీగ్​తో రిలయన్స్ ఫౌండేషన్​కు ఆరేళ్ల భాగస్వామ్యం ఉంది. జూనియర్ ప్రోగ్రాం ద్వారా వేడుకలా చేయనుంది రిలయన్స్ ఫౌండేషన్​. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాలో జరుగనున్న తొలి మ్యాచ్​ వీక్షించేందుకు చిన్నారులను తీసుకురానుంది.

"ఎన్​బీఏ భారత్​కు తీసుకురావడాన్ని రిలయన్స్​ ఫౌండేషన్​ గర్వంగా భావిస్తోంది. తొలిమ్యాచ్​ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ చిన్నారులకు లభిస్తోంది. ఎన్​బీఏతో మా ప్రయాణంలో ఇదో కీలక పరిణామం. ఈ మజిలీలో మాతో భాగస్వామ్యమైనందుకు ఎన్​బీఏకు కృతజ్ఞతలు. విభిన్న రకాల క్రీడల్లో భారత్​ రాణిస్తోంది. 25ఏళ్ల లోపు యువకులు భారత్​లో 60 కోట్ల మంది ఉన్నారు. క్రీడల్లో భారత భవిష్యత్తు మరింత వెలుగొందుతుందని అనుకుంటున్నా" - నీతాఅంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​.

20 రాష్ట్రాల్లోని 34 పట్టణాలకు చెందిన 1.1 కోట్ల మంది పిల్లలకు ఈ గేమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకోవడం మరో విశేషం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బాస్కెట్ బాల్‌ను చేర్చడం ద్వారా యువత ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.

ఇదీ చదవండి: చదరంగం: ప్రపంచ 3వ ర్యాంకులో కోనేరు హంపి

ABOUT THE AUTHOR

...view details