కరోనా మహమ్మారి వల్ల త్వరలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఒకవేళ వైరస్ ప్రభావం అప్పటికి తగ్గకపోయినా, వ్యాక్సిన్ కనిపెట్టకపోయిన పరిస్థితి ఏంటి? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై ఓ వార్త ఏజెన్సీతో మాట్లాడిన ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ.. అప్పటికీ కరోనా కట్టడి జరగకపోతే క్రీడల్ని రద్దు చేస్తామని అన్నారు.
గతంలో ప్రపంచ యుద్ధం జరిగినపుడే ఒలింపిక్స్ రద్దయినట్లు చెప్పిన మోరీ... మనం కంటికి కనపడని శత్రువుతో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఒకవేళ వైరస్ పూర్తిగా అంతమైపోతే వచ్చే ఏడాది వేసవిలో మెగాక్రీడల్ని కచ్చితంగా నిర్వహిస్తామని తెలిపారు.