కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. ఇప్పుడు సంబంధిత తేదీలను ప్రకటించారు. వచ్చే సంవత్సరం జులై 23న మొదలై ఆగస్టు 8న ముగియనున్నాయి.
టోక్యో ఒలింపిక్స్ కొత్త తేదీలు వచ్చేశాయ్ - sports news
వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్ తేదీలపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు వివరాలను ప్రకటించారు.
ఒలింపిక్స్ జరిగే తేదీలపై వారంలో స్పష్టత
షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జులై 24 న ప్రారంభమై 16 రోజులపాటు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం ఈ క్రీడలపై పంజా విసిరింది. ఇందులో మారథాన్‌ను అధిక ఉష్ణోగ్రత కారణంగా సప్పొరో నగరానికి మార్చారు. ఈ ఊరు టోక్యోకు సుమారు 800 కిలోమీటర్ల(500మైళ్లు) దూరంలో ఉంది.
ఇదీ చదవండి:విశ్వక్రీడల వాయిదా ఖరీదెంత!