అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సంయుక్త ప్రపంచకప్ వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 26 వరకు దేశ రాజధానిలో జరగనుంది. ఇందులో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ పోటీలు ఉండనున్నాయి. ఈ పోటీలు వచ్చే వేసవి టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధం కావడానికి షూటర్లకు మంచి వేదికగా మారనున్నాయి.
కార్యనిర్వాహక కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఐఎస్ఎస్ఎఫ్ సోమవారం తేదీలు ఖరారు చేసింది.