ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్‌గా నేత్రా కుమనన్(తమిళనాడు) చరిత్ర సృష్టించింది. ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోని లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో పోటీ పడిన ఈమె.. బుధవారం పోటీల్లో 21 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. దీంతో తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
నేత్రాతో పాటు మన దేశం నుంచి మరో ముగ్గురు, సెయిలింగ్ పోటీల కోసం ఒలింపిక్స్‌కు వెళ్లనున్నారు. వీరిలో విష్ణు శరవణన్, గణపతి చెంగప్ప-వరుణ్ తక్కర్ జోడీ ఉంది.