ఆరడగుల అందగాడు.. ఆపై ప్రపంచ ఛాంపియన్.. భారతీయ యువతకు ఐకాన్..! ఇంకేముంది ఇప్పుడు నీరజ్ చోప్డా(Neeraj Brand Value) కోసం బ్రాండ్లు క్యూకడుతున్నాయి. అతడు ఒలింపిక్ స్వర్ణం గెలిచిన రోజునే ఇన్‌స్టాలో ఈ ఛాంపియన్ ఫాలోవర్ల సంఖ్య పదకొండు లక్షలు పెరిగింది. నెలరోజుల వ్యవధిలో నీరజ్‌ను అనుసరించేవారి సంఖ్య 46 లక్షలను దాటేసింది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజ్ 1000 శాతం పెరిగినట్లు వార్తలొస్తున్నాయి.
సోషల్ మీడియాలో మెన్షన్స్ సునామీ..!
సోషల్ మీడియాలో నీరజ్(Neeraj Chopra Followers Before and After ) ఫాలోయింగ్‌పై 'యూగోవ్ స్పోర్ట్స్' అనే రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఒలింపిక్స్ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మెన్షన్స్ అందుకున్న క్రీడాకారుడు నీరజ్ చోప్డా(Neeraj Chopra Javelin Thrower) అని తేల్చింది. 14 లక్షల మంది ఆయన్ను 29లక్షల సార్లు మెన్షన్ చేశారు. పతకం రాక ముందు అతని మెన్షన్స్‌తో పోలిస్తే ఇది 1401 శాతం అధికం. ఇక ఆయన్ను మెన్షన్ చేసేవారి సంఖ్య 2055శాతం పెరిగింది. సోషల్ , డిజిటల్ మీడియాలో అతడి రీచ్ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్ చోప్డా సోషల్ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది.
ఒలింపిక్ స్వర్ణం తర్వాత పాక్ క్రీడాకారుడు అర్షాద్ నదీమ్‌పై నీరజ్ అభిమానులు విమర్శలు కురిపించారు. ఈ సమయంలో నీరజ్ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది.
గతంలో నీరజ్ వాణిజ్య ప్రకటనల పునఃసమీక్ష..!
నీరజ్ చోప్డా గోల్డ్ మెడల్ రాక ముందు కూడా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఛార్జ్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ బల్లెం వీరుడి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతంలో చేసుకొన్న ఒప్పందాల్లో మార్పులు చేసుకోనున్నారు. ఈ విషయాన్ని నీరజ్ బ్రాండ్ విషయాలు చూసుకొనే జెఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సీఈవో ముస్తఫా గౌస్ ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "అవి మల్టీ బిలియన్ డీల్స్.. పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగనున్నాయి" అని వెల్లడించారు.
మద్యం, పొగాకు ప్రకటనలకు దూరం..